మన గుణగణాలు, ప్రవర్తన మనం తినే ఆహారం మీద, మనం చేసే స్నేహాల మీద, మనం చదివే పుస్తాకాల మీద ఆదారపడి వుంటాయి. ఒక మఱ్రి చెట్టుపై రెండు చిలుక పిల్లలు ఉండేవి ఒక బోయవాడు వల పన్ని ఆ రెండు పిల్లల్ని పట్టి ఒక దాన్ని గోదావరి తీరంలో ఉండే ఒక సాధువుకి, రెండవదాన్ని ఒఖ సైనికునికి అమ్మాడు. ఆ సాధువు, ఆ సైనికుడు వాటిని తమ గృహాలకు తీసుకెళ్ళి రాముడు అనీ సాధువు, ధుర్మఖుడు అనీ సైనికుడు వాటికి పేర్లు పెట్టి పంజరాల్లో వుంచి, వాటికి ఆహారం పెడుతూ మాటలు నేర్పుతూ పెంచసాగారు. రాముడు చిలుక ఆ సాధువు ఇంట్లో సాత్త్విక ఆహారాన్ని తింటూ, మధురమైన మాటలతో, మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. అతిథుల్ని గౌరవించే పద్దతుల్ని గమనించి మంచి స్వభాన్ని అలవరకుకొని ఇంటికి వచ్చిన వారందరిని మంచి మాటలతో పలుకరించి గౌరవిస్తూ సంతోషపరిచేది. ధుర్ముఖుడు చిలుక సైనికుడి ఇంట్లో మాట్లాడే దుష్ట వాక్యాల్ని వినడం వల్ల, హింసాపూరిత కార్యాల్ని చూస్తుండడం వల్ల రోజు రోజుకి దుష్ట సంస్కారాన్ని అలవర్చుకొని, సైనికుడి ఇంటికి వచ్చే వారందరితోనూ పరుషమైన మాటలు మాట్లాడుతూ, ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది. ఈ విధంగా కొంతకాలం గడచిన తరువాత అదృష్టవశాత్తు పంజరంలో నుంచి విముక్తి పొంది ఈ రెండు చిలుకలు ఎగిరిపోయి, రాముడు చిలుక మామిడి చెట్టుమీదా, దుర్ముఖుడు చిలుక కొంత దూరంలో ఉన్న మఱ్రి చెట్టుమీద గూడు కట్టుకుని నివసించసాగాయి. ఒక రోజు ఆ దారిలో వెళ్ళుతున్న ఒక బ్రహ్మణుడు ఎండ వేడికి అలసిపోయి దుర్ముఖుడు చిలుక వుండే మఱ్రిచెట్టు కిందకి విశ్రాంతికోసం వచ్చాడు. అతన్ని చూడగానే దుర్ముఖుడు చిలుక ఇతర పక్షులతో ఎవరో మనిషి ఇక్కడకు వచ్చాడు. వాడి శరీరాన్ని పొడిచి, హింసిద్దాం రండి అంటూ గట్టిగా అరవడంతో ఆ బ్రాహ్మణుడు భయపడి, పారిపోయి రాముడు చిలుక ఉన్న మామిడి చెట్టు వద్ద్ పరుగుతో వచ్చాడు. రాముడు చిలుక బ్రాహ్మణుడు రావడాన్ని గమనించి ఇతర పక్షులన్నంటిని పిలుస్తూ ఎవ్వరో అతిథి ఎండ వేడిమికి అలసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టుకిందకు వచ్చాడు. స్వాగతం పలికి పళ్ళను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి. తరువాత ఆయనకు సేవచేసి సత్కరించండి అని చెప్పింది. ఒకే తల్లికి పుట్టిన రెండుపిల్లల ప్రవర్తన అవి పెరిగిన పరిసరాలతో సంబంధం ఉంటుంది. ఈ కథలోని నీతి : చిన్నతనంలో మంచివారి స్నేహం సత్ర్పవర్తన, అలవాటు చేసుకొంటారో అలాంటి పిల్లలు పెద్దయిన తరువాత కూడా మంచి సంభాషణ, మంచి బుద్ది, మంచి ఆలోచనలతో సత్ర్పవర్తన, సద్గుణాల్ని కలిగి ఉంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: